- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూనివర్సిటీలో పాలక్ పన్నీర్ వివాదం.. USలో భారత విద్యార్థులకు రూ.1.7 కోట్ల పరిహారం
అగ్రరాజ్యం అమెరికాలో ‘పాలక్ పన్నీర్’ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ‘పాలక్ పన్నీర్’ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ‘ఫుడ్ రేసిజం’ (Food Racism)కు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో భారత పీహెచ్‌డీ విద్యార్థులు 2 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1.7 కోట్ల పరిహాన్ని పొందిన ఘటన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ (University of Colorado Boulder) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 2023లో భోపాల్‌కు చెందిన ఆదిత్య ప్రకాష్ (Aditya Prakash), యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగంలో తన లంచ్ కోసం పాలక్ పన్నీర్ తీసుకువచ్చారు. అయితే, అప్పటికే ఆహారం చల్లబడటంతో మైక్రోవేవ్‌లో వేడి చేస్తుండగా అక్కడున్న యూనివర్సిటీ సిబ్బంది వచ్చి ఆ వాసన అసహ్యంగా ఉందని కామెంట్ చేసింది. మైక్రోవేవ్‌లో వేడి చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకు ఆదిత్య ప్రకాశ్ యూనివర్సిటీ అందరి స్థలమని, ఆహారాన్ని వేడి చేసుకునే హక్కు తమకు ఉందని సున్నితంగా బదులిచ్చారు.
వివక్ష.. ప్రతీకార చర్యలు
పాలక్ పన్నీరు వివాదం చిలికిచిలికి గాలివానలా తయారైంది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ యాజమాన్యం ఆదిత్యపై కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఇక ఆదిత్య వైఫ్ కోల్‌కతాకు చెందిన ఊర్మి భట్టాచార్య (Urmi Bhattacharya) కూడా అక్కడే పీహెచ్‌డీ చేస్తున్నారు. దీంతో ఎలాంటి రీజన్ లేకుండా ఆమెను టీచింగ్ అసిస్టెంట్‌షిప్ నుంచి తొలగించారు. మిగిలిన భారతీయ విద్యార్థులు సంఘీభావంగా భారతీయ ఆహారాన్ని క్యాంపస్‌కు తీసుకురాగా, ఆ పరిణామాన్ని అల్లర్లుగా యూనివర్సిటీ సిబ్బంది చిత్రీకరించారు. ఈ క్రమంలోనే ఆదిత్య ప్రకాశ్, ఊర్మి భట్టాచార్య పీహెచ్‌డీ మధ్యలో సంపాదించిన మాస్టర్స్ డిగ్రీలను అందజేయడానికి యూనివర్సిటీ నిరాకరించింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆదిత్య, ఊర్మీ ఫెడరల్ సివిల్ రైట్స్ (Federal Civil Rights) కింద కేసు ఫైల్ చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బాధిత విద్యార్థులకు 2 లక్షల డాలర్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా భవిష్యత్తులో వారు ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి వీలులేదని నిబంధన విధించింది.






