- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20 వరల్డ్ కప్ కు మేం వ్యతిరేకం కాదు : పాక్
2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు రావడం లేదని బంగ్లాదేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు రావడం లేదని బంగ్లాదేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ దేశ జాతీయ గౌరవం కోసం కోల్‌కతా, ముంబయిల్లో జరగాల్సిన తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డు పేర్కొంది. దీనికి మద్దతుగా పాకిస్థాన్ కూడా ప్రపంచకప్‌ను బహిష్కరిస్తుందనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే ఈ వార్తలను పాకిస్థాన్ తాజాగా ఖండించింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ భద్రత కారణాలతో భారత్‌లో మ్యాచ్‌లు ఆడకపోయినా, తాము మాత్రం టోర్నమెంట్‌ను బహిష్కరించబోమని పాకిస్థాన్ తెలిపింది.
2025 ప్రారంభంలో జరిగిన ఒప్పందం ప్రకారం తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ చేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. అలాంటపుడు టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. వివాదాలు సృష్టించేందుకే కొందరు ఇలాంటి వార్తలు అసత్య ప్రచారం చేస్తున్నారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మండిపడింది.






