ఢిల్లీ, అమృత్‌సర్‌ లక్ష్యంగా పాక్ క్షిపణి పరీక్షలు!

by Muthe.Rajitha |

పాకిస్తాన్ తాజాగా ఫతా-4 అనే శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. కాగా దీని పరిధి ఢిల్లీ వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీ, అమృత్‌సర్‌ లక్ష్యంగా పాక్ క్షిపణి పరీక్షలు!
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ తాజాగా ఫతా-4 (Fatah-4) అనే అత్యాధునిక గైడెడ్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్ష, దేశీయంగా అభివృద్ధి చేసిన సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంగా పాకిస్తాన్ సైనిక మీడియా విభాగం (ISPR) అభివర్ణించింది. అయితే ఇది భారత్ బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా భావిస్తున్నారు. ఫతా-4 సుమారు 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. భూతలం నుండి ప్రయోగించే ఈ క్షిపణిలో అత్యంత ఆధునికమైన ఏవియానిక్స్, నావిగేషన్ వ్యవస్థలను పొందుపరిచారు. శత్రు రాడార్లకు చిక్కకుండా భూ ఉపరితలానికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే 'టెర్రైన్-హగ్గింగ్' (Terrain-hugging) సామర్థ్యాన్ని కలిగి ఉంది. శత్రువుల రక్షణ కవచాలను ఛేదించి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునే ఈ క్షిపణి రేంజ్ లోకి భారత్ లోని ఢిల్లీ, అమృత్‌సర్‌ నగరాలు వస్తాయి. కాగా ఈ వ్యవహారాన్ని భారత రక్షణ రంగం నిశితంగా గమనిస్తున్నట్టు సమాచారం.

Next Story