- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాంబా సెక్టార్‌లో పాక్ డ్రోన్ కలకలం.. భారీగా ఆయుధాలు స్వాధీనం
సరిహద్దులో దాయాది పాకిస్తాన్ (Pakistan) మరోసారి తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది.

దిశ, వెబ్‌డెస్క్: సరిహద్దులో దాయాది పాకిస్తాన్ (Pakistan) మరోసారి తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. డ్రోన్ల ద్వారా భారత్‌లోకి ఆయుధాలను చేరవేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించింది. అయితే, అప్రమత్తంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (BSF) ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
వివరాల్లోకి వెళితే.. ఇవాళ తెల్లవారుజామున జమ్మూలోని సాంబా (Samba) సెక్టార్ పరిధిలో పాక్ డ్రోన్ కదలికలు కలకలం సృష్టించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పద శబ్ధం రావడంతో బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. డ్రోన్ ద్వారా పాక్ ముష్కరులు ఆయుధాలను భారత భూభాగంలోకి జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. సరిహద్దులోని ఫ్లోరా (Flora) గ్రామం సమీపంలో భద్రతా దళాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టగా, ఒక పొట్లంలో ప్యాక్ చేసిన 3 పిస్టల్స్, గ్రెనేడ్, 16 రౌండ్ల బెల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు ప్రస్తుతం బార్డర్ వెంట గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా ఏవైనా ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలు జారవిడిచారా అన్న కోణంలో భద్రతా దళాలు క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నాయి. పాక్ గత కొంతకాలంగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు దాటకుండానే ఆయుధాలను, డ్రగ్స్‌ను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా దొరికిన ఆయుధాలు ఎవరి కోసం పంపారు? దీని వెనుక ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్ ఏమిటి? అనే విషయాలపై నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.






