పద్మశ్రీ మొగులయ్య పెద్ద మనసు.. మతిస్థిమితం లేని వ్యక్తికి బట్టలు తొడిగి..

by Dishafeatures2 |
పద్మశ్రీ మొగులయ్య పెద్ద మనసు.. మతిస్థిమితం లేని వ్యక్తికి బట్టలు తొడిగి..
X

దిశ, అచ్చంపేట : పద్మశ్రీ గ్రహీత కిన్నెర మొగులయ్య తన పెద్ద మనసు చాటుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తికి కొత్త దుస్తులు ఇవ్వడమే కాకుండా తానే స్వయంగా వాటిని తొడిగారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల దర్శనం కిన్నెర మొగులయ్య మతిస్థిమితం లేని వ్యక్తికి కొత్త దుస్తులు ఇచ్చారు. అంతేకాకుండా రోడ్డుపైనే మొగులయ్య స్వయంగా అతడికి దుస్తులు తొడిగారు. ఓ మతిస్థిమితం లేని వ్యక్తిపట్ల మొగులయ్య చూపిన ఆప్యాయతను చూసి చుట్టుపక్కల వారు ఆయనను అభినందిస్తున్నారు.

Next Story

Most Viewed