- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్కడికక్కడే ఆగిన వరి ధాన్యం.. లారీలు వస్తలేవని ఆవేదన
ఉప్పునుంతల మండలంలోని ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న వరి ధాన్యం 25 రోజులుగా మగ్గుతున్నా లారీలు రావడం లేదని వర్షంలో ధాన్యం తడిసిపోతుందని రైతులు అధికారులతో వాగ్వివాదం చేశారు.

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోని ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న వరి ధాన్యం 25 రోజులుగా మగ్గుతున్నా లారీలు రావడం లేదని వర్షంలో ధాన్యం తడిసిపోతుందని రైతులు అధికారులతో వాగ్వివాదం చేశారు. ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం కలెక్టర్ వస్తున్నడనే విషయం తెలుసుకున్న రైతులు వర్షంలో తడుస్తూనే సెంటర్ వద్దకు వచ్చిన అధికారులతో తమ బాధలను వర్ణించారు. రైతులు పండించిన పంటను వర్షార్పణం కావడానికి గల కారకులెవ్వరని కేవలం సంబంధిత అధికారులేనని రైతులు మండిపడ్డారు. సకాలంలో లారీలు రాకపోవడంతోనే ధ్యానం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని దానివల్లనే రైతుల ధాన్యం తడిసి నష్టపోతున్నామని వారి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎసీఎస్ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తున్నారని కేవలం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అందులో పెద్దాపూర్ సెంటర్ వద్ద మరి నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
బురదమయంగా మొల్గర సెంటర్..
మండలంలోని మొల్గర వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ వద్ద బురద మయంగా మారి కనీసం మనుషులు నడవటానికి కూడా వీలు లేని విధంగా కరిగేటను తలపించేలా ఉందని కనీసం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులంటే ప్రతి ఒక్కరికి చిన్నచూపేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






