‘OYO’ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా.. వీటితో పాటు?

by Kodari Anjali |

దూర ప్రయాణాలు చేసేవారు రెస్ట్ కోసం, పార్టీలు జరుపుకునేందుకు ఓయో రూమ్స్ ను జనాలు ఉపయోగించుకుంటారు.

‘OYO’ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా.. వీటితో పాటు?
X

దిశ, వెబ్‌డెస్క్: దూర ప్రయాణాలు చేసేవారు రెస్ట్ కోసం, పార్టీలు జరుపుకునేందుకు ఓయో రూమ్స్ ను జనాలు ఉపయోగించుకుంటారు. ఓయో రూమ్‌లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ కెళ్లి ఈ యాప్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకుని రూమ్ బుక్ చేసుకుంటారు.

ఈ అధికారిక ఓయో రూమ్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాక OTPని నమోదు చేయడం ద్వారా యాప్‌కి సైన్ ఇన్ చేస్తారు. తర్వాత సైన్ ఇన్ చేసిన అనంతరం మీరు బస చేయాలనుకుంటున్న ప్రాంతం, స్థానం లేదా హోటల్ కోసం సెర్చ్ చేశాక.. తర్వాత మీరు బస చేసే తేదీలు, అతిథుల సంఖ్యను ఎంచుకుని నెక్ట్స్ సెలక్ట్ చేసుకోవాలి.

హోటల్‌లో చెక్ ఇన్ చేయడానికి ప్రాథమిక అతిథికి కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. అతిథులు చెక్-ఇన్ సమయంలో చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అతిథులు తప్పనిసరిగా పెద్దవారితో పాటు ఉండాలి. ఫోటో గుర్తింపును తనిఖీ చేసే హక్కు హోటల్‌కి ఉంటుంది.

అయితే చాలా మంది ఓయో రూమ్ కెళ్లి సమయాన్ని గడుపుతుంటారు. కానీ ఓయో ఫుల్ ఫామ్ చాలా మందికి తెలిసి ఉండదు. మరీ ఓయో ఫుల్ ఫామ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హోటల్ చైన్ గ్రూప్ ఓయో కంపెనీ ఫుల్ ఫామ్ చూసినట్లైతే.. ‘ఆన్ యూవర్ ఓన్’ (On Your Own). అలాగే దీనితో పాటు ఐటీసీ- ఇండియన్ టొబాకో సంస్థ (Indian Tobacco Company), ప్రముఖ టైర్ల కంపెనీ ఎమ్‌ఆర్ఎఫ్ - మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (Madras Rubber Factory), అలాగే విప్రో- వెస్ట్రన్ ఇండియన్ పామ్ రిఫైండ్ ఆయిల్ లిమిటెడ్ (WESTERN INDIAN PALM REFINED OIL LIMITED). ఐసీఐసీఐ- ఇండస్ట్రీయల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా (Industrial Credit and Investment Corporation of India). అలాగే గుజరాత్ (Gujarat) కు చెందిన ప్రముఖ డెయిరీ కంపెనీ అమూల్ ఫుల్ ఫామ్ (Amul Full Farm is a leading dairy company).. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్.

Next Story