- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌశిక్ రెడ్డిలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కనిపిస్తోందంటూ ఒవైసీ ఫైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సీపీపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. దీంతో కౌశిక్ రెడ్డి తీరుపై AIMIM అధినేత, అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సీపీపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. దీంతో కౌశిక్ రెడ్డి తీరుపై AIMIM అధినేత, అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.." ఒక ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ముస్లింల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని బయటపెట్టాయని ఒవైసీ మండిపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం పేరుతో దాడి చేయడం, అభ్యంతరకర భాషను ఉపయోగించడం అత్యంత విచారకరమని ఆయన అన్నారు. "మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ఆయనను ఆర్‌ఎస్‌ఎస్ (RSS) భావజాలం ఆవహించినట్లు కనిపిస్తోంది" అని ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నాయకత్వంలోని పార్టీలో ఉంటూ ఇలాంటి ప్రకటనలు చేయడం శోచనీయమని, దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించాలని ఆయన హితవు పలికారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహం
అలాగే త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కూడా ఒవైసీ స్పందించారు. తమ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్లుగా గెలిపించుకోవడమే లక్ష్యంగా తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని ఒవైసీ తెలిపారు. అందులో భాగంగానే నేడు తమ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.






