- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంతో మా గ్రాఫ్ పెరిగింది : బద్దం ఇంద్రకరణ్ రెడ్డి
ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇళ్లు నిర్మిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ మరింత పెరిగిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

దిశ, భిక్కనూరు : ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇళ్లు నిర్మిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ మరింత పెరిగిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలోని తన నివాసంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, అయితే తమ ప్రభుత్వం నిలువనీడలేని పేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించి ఇస్తోందని తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు వ్యయం చేస్తున్నామని, ఫలితంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరడంతో లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (కంట్రోల్ షాపుల) ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయా అని విలేకరులు ప్రశ్నించగా, అలాంటి విభేదాలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మార్గదర్శకత్వంలో అందరూ సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ పాల్గొన్నారు.






