- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధానిని ఏం చేస్తామో చూస్తాం".. స్పీకర్ ఛాంబర్‌లో ప్రతిపక్షాల బెదిరింపులు? వెలుగులోకి షాకింగ్ వివరాలు
భారత ప్రధాని నరేంద్ర మోడీపై లోక్ సభ సమావేశాల్లో దాడికి ప్లాన్ చేశారని వచ్చిన వార్తలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై లోక్ సభ సమావేశాల్లో దాడికి ప్లాన్ చేశారని వచ్చిన వార్తలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి.. విశ్వసనీయ వర్గాల ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సభలో గందరగోళం చెలరేగిన సమయంలో పలువురు మహిళా ఎంపీలు దూకుడుగా ప్రధాని కూర్చునే సీటు వైపు దూసుకెళ్లి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. మరికొందరు సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ట్రెజరీ బెంచీలలోకి చొరబడటమే కాకుండా, సీనియర్ మంత్రులు కూర్చునే స్థలంలోకి కూడా ప్రవేశించి తీవ్రమైన అభద్రతా భావాన్ని సృష్టించారు. కేవలం నిరసన కే పరిమితం కాకుండా, ఎంపీల వైఖరి నేరుగా ఘర్షణకు దిగేలా ఉండటం ఆందోళన కలిగించింది.
సభ వెలుపల కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి అక్కడ అత్యంత అపార్థకమైన, పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా భాషను ఉపయోగించినట్లు సమాచారం. "ప్రధానిని ఏం చేస్తామో చూస్తాం" (देखते हैं PM का क्या करते हैं) అంటూ బెదిరింపులకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎంపీల హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభా మర్యాదలకు తిలోదకాలు ఇవ్వడమేనని లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలు సభలో శాంతిభద్రతల నిర్వహణను ప్రశ్నార్థకం చేశాయి.
ఈ నేపథ్యంలోనే, ప్రధాని భద్రత పై ఆందోళన చెందిన స్పీకర్, ఆయనను సభలోకి రావద్దని సూచించినట్లు స్పష్టమవుతోంది. ఇది కేవలం స్పీకర్ ఊహ కాదు. సభలో ప్రత్యక్షంగా జరిగిన పరిణామాల ఆధారంగా తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయమని వర్గాలు వెల్లడించాయి. ప్రధానిపై ఎటువంటి ముప్పు లేదన్న ప్రతిపక్షాల వాదనలను ఈ వాస్తవాలు పటాపంచలు చేస్తున్నాయి. పార్లమెంట్ గౌరవాన్ని, ప్రధాని రక్షణను కాపాడటం తన రాజ్యాంగబద్ధమైన విధి కాబట్టే స్పీకర్ ఆ సమయానికి అప్రమత్తం చేశారని ఈ పరిణామాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే స్పీకర్ ప్రవర్తనపై అసంతృప్తి చెందిన ప్రతిపక్ష సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధం అయ్యారు.






