రిపబ్లిక్ డే పరేడ్‌లో హైలైట్,, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన 'ఆపరేషన్ సిందూర్' శకఠం!

by Malleboina Mahesh |

77వ గణతంత్ర వేడుకలు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన శకఠాలతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన శకఠాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రిపబ్లిక్ డే పరేడ్‌లో హైలైట్,, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్ శకఠం!
X

దిశ, వెబ్ డెస్క్: 77వ గణతంత్ర వేడుకలు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన శకఠాలతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన శకఠాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భాగంగా 'ఆపరేషన్ సిందూర్' విజయగాథను చాటిచెప్పే ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ (IOC) శకఠం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్, కేవలం 88 గంటల్లోనే శత్రువును మోకాళ్లపైకి తెచ్చింది. సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన వైనాన్ని ఈ శకఠం కళ్లకు కట్టింది.

గ్లాస్ కేసింగ్‌తో రూపొందించిన ఈ ఆపరేషన్ సెంటర్, భారత సాయుధ దళాల సమన్వయ శక్తిని, నాయకత్వ పటిమను చాటిచెప్పింది. ఈ ప్రదర్శనలో భారత రక్షణ రంగ స్వావలంబన స్పష్టంగా కనిపించింది. బ్రహ్మోస్ క్షిపణులు శత్రువు పై విరుచుకుపడగా, ఆకాశ్, ఎస్-400 వ్యవస్థలు 'సుదర్శన చక్రం'లా భారత గగనతలానికి రక్షణ కవచంగా నిలిచిన తీరును ప్రదర్శించారు. వీటితో పాటు స్వదేశీ సాంకేతికతతో తయారైన 'దివ్యాస్త్ర', 'శక్తిబాన్' వంటి సరికొత్త డ్రోన్ వ్యవస్థలు, స్వార్మ్ డ్రోన్‌లు, అత్యాధునిక యుఏవీలు (UAV) కర్తవ్య పథ్‌లో కదం తొక్కాయి. యుద్ధ తంత్రంలో సాంకేతికతను జోడించి భారత్ ఎంతటి పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్మించుకుందో ఈ శకఠం ప్రపంచానికి చాటి చెప్పింది.

Next Story