- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరా పార్క్‌లో తెరిచిన బోరుపైపు
నిత్యం వందలాది మంది సందర్శించే హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న ప్రసిద్ధ ఇందిరా పార్క్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.

దిశ, రాంనగర్ : నిత్యం వందలాది మంది సందర్శించే హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న ప్రసిద్ధ ఇందిరా పార్క్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పార్క్‌లో ఒకచోట విరిగిపోయిన బోరు పీవీసీ పైపు మూత లేకుండా నోరు తెరిచి ఉంది. దీనికి ఎలాంటి మూత గానీ, ఇనుప కవర్ గానీ, హెచ్చరిక బోర్డు గానీ లేదు. ఇందిరా పార్కుకు ప్రతిరోజూ వాకింగ్‌కు వచ్చేవారు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు, ఆడుకునే పిల్లలు ఎంతో మంది ఉంటారు. ఇలాంటి బహిరంగ ప్రదేశంలో ఇలా తెరిచి ఉంచడం చాలా ప్రమాదకరం.
పిల్లలు ఆటల్లో పడిపోవచ్చు. రాత్రి వేళల్లో నడిచేవారికి ఇది కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గతంలో రాష్ట్రంలో తెరిచి ఉన్న బోరు బావుల వల్ల ఎన్నో విషాద ఘటనలు జరిగాయి. అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు, పార్కు నిర్వహణ సిబ్బంది పట్టించుకోవడం లేదని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు వెంటనే ఈ పైపుకు శాశ్వత మూత ఏర్పాటు చేయాలని, పార్క్ మొత్తం తనిఖీ చేసి ఇలాంటివి మరెక్కడైనా ఉంటే వాటిని కూడా మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






