OnePlus 15R: 7400mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు.. ఆ బ్రాండ్లకు చెక్ పెట్టిన వన్‌ప్లస్

by Malleboina Mahesh |   (  Updated:2026-02-04 09:30:23  IST  )

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్'గా పేరుగాంచిన వన్‌ప్లస్ కంపెనీ. OnePlus 15R మొబైల్‌తో సంచలనం సృష్టిస్తోంది. మధ్యతరగతి ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని విడుదలైన ఈ ఫోన్, ముఖ్యంగా తన బ్యాటరీ, ప్రాసెసర్ శక్తితో వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

OnePlus 15R: 7400mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు.. ఆ బ్రాండ్లకు చెక్ పెట్టిన వన్‌ప్లస్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎంతో పోటీ నెలకొంది. దీంతో అన్ని కంపెనీలు కష్టమర్లను ఆకర్షించడం తో పాటు మెరుగైన ఎక్స్ పీరియన్స్ అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కో కంపెనీ నుంచి ఒక్కో మోడల్ విడుదల చేస్తున్నాయి. ఇందులో 2026 ఆరంభంలోనే అదిరిపోయే ఫీచర్లు.. మధ్యతరగతి వారికి అనుకూల మైన ధరల్లో అనేక మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్'గా పేరుగాంచిన వన్‌ప్లస్ కంపెనీ. OnePlus 15R మొబైల్‌తో సంచలనం సృష్టిస్తోంది. మధ్యతరగతి ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని విడుదలైన ఈ ఫోన్, ముఖ్యంగా తన బ్యాటరీ, ప్రాసెసర్ శక్తితో వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

బ్యాటరీ లో మొనగాడు OnePlus 15R

24 గంటలు నెట్ ఆన్ చేసి ఉంచడంతో నేటి యువత నిత్యం ఛార్జింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ప్రధాన బ్యాటరీ సమస్యను దృష్టిలో పెట్టుకొని దీనికి పరిష్కారంగా వన్‌ప్లస్ ఏకంగా 7400mAh భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో ప్రవేశపెట్టింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే ఫుల్ ఛార్జ్ అయ్యే 150W సూపర్ వూక్ (Super VOOC) టెక్నాలజీని ఇందులో ఉంచారు. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో రెండు రోజుల వరకు బ్యాటరీ ఇబ్బంది ఉండదు.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 స్పీడ్..

OnePlus 15Rలో క్వాల్‌కామ్ లేటెస్ట్ చిప్‌సెట్ Snapdragon 8 Gen 5ని అమర్చారు. ఇది హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేమింగ్ ప్రియులకు ఇది ఒక వరంగా మారనుంది. అలాగే ఏఐ ఫీచర్స్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ చిప్‌సెట్ వల్ల ఫోన్ వేడెక్కదు సరే కదా, మల్టీ టాస్కింగ్‌లో అద్భుతమైన వేగాన్ని ప్రదర్శిస్తుంది.

కెమెరా - డిస్ప్లే

ఈ OnePlus 15 R లో 6.7-అంగుళాల అమోలెడ్ (AMOLED) స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే 50MP మెయిన్ సెన్సార్ (Sony LYT) తో రాత్రిపూట కూడా అత్యంత నాణ్యమైన ఫోటోలను క్లిక్ చేయవచ్చు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు గల ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో రూ. 39,999 నుంచి ప్రారంభమవుతోంది. అలాగే రూ. 60,000 లోపు ప్రీమియం అనుభూతిని ఇచ్చే బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ OnePlus 15R సరైన ఎంపికగా విశ్లేషకులు చెబుతున్నారు.

వేరియంట్ (RAM + Storage)-అసలు ధర (MRP)-ఆఫర్ ధర (Effective Price)

12GB + 256GB-₹54,999-₹47,999

12GB + 512GB-₹59,999₹52,999

తక్షణ డిస్కౌంట్: HDFC, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ₹2,000 నుండి ₹3,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది.

నో-కాస్ట్ EMI: ప్రముఖ బ్యాంకుల ద్వారా 6 నెలల వరకు ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా (No-Cost EMI) కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్ఛేంజ్ బోనస్: మీ పాత ఫోన్‌ను మార్చుకుంటే అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది.

Next Story