- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాలెట్ ఓట్లతో 304 సీట్లు మావే: ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ట్వీట్
by Harish |
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఫలితాలు వెలువడిన ఐదు రోజుల తర్వాత సమాజ్‌వాదీ ..telugu latest news

X
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఫలితాలు వెలువడిన ఐదు రోజుల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మిత్రపక్షంతో కలిసి 304 సీట్లు గెలిచామని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఎస్పీ కూటమి పోస్టల్ బ్యాలెట్‌లో 51.5శాతం ఓట్లు వచ్చాయి. దీని ప్రకారం ఎస్పీ కూటమికి 304 సీట్లు వచ్చాయి' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అధికారంలో ఉన్నవారు ఇది గుర్తుంచుకోవాలని బీజేపీకి సందేశం పంపారు. మోసం ఎప్పుడూ బలాన్ని ఇవ్వదని అన్నారు. కాగా గురువారం వెలువడిన ఫలితాల్లో 403 అసెంబ్లీ స్థానాలకు గాను ఎస్పీ కూటమి 125 సీట్లు గెలుపొందింది. అధికార పార్టీ బీజేపీ 255 స్థానాల్లో విజయం సాధించింది.
Next Story






