- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిపబ్లిక్ డే వేళ ‘26-26’ కోడ్ నేమ్ తెరపైకి.. భీకర దాడులకు జైషే మహ్మద్ కుట్ర
దేశ వ్యాప్తంగా ప్రజలంతా రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలకు సన్నద్ధం అవుతుంటే.. మరోవైపు ఉగ్ర మూకలు మరోసారి భారత్‌పై భీకర దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా భారత నిఘా సంస్థలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రజలంతా రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలకు సన్నద్ధం అవుతుంటే.. మరోవైపు ఉగ్ర మూకలు మరోసారి భారత్‌పై భీకర దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా భారత నిఘా సంస్థలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చాయి. దాయాది పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ, ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీ (Dehli) వ్యాప్తంగా భీకర దాడులు చేసేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌తో స్కెచ్ వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ కుట్రలో భాగంగా గణతంత్ర వేడుకలు జరిగే కర్తవ్య పథ్, ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాలతో పాటు, రద్దీగా ఉండే మార్కెట్లు, మెట్రో స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా విదేశాల్లో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాదులు, స్థానిక గ్యాంగ్‌స్టర్ల నెట్‌వర్క్‌ను వాడుకుని హైబ్రిడ్ తరహాలో ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా తేలింది.
రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు..
నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆపరేషన్ గ్యాంగ్-బస్ట్ 2026 (Operation Gang-Bust 2026) పేరుతో స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించి ఇప్పటి వరకు అల్-ఖైదా (Al-Qaeda), జైషే మహ్మద్ సంస్థలకు చెందిన పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో ఢిల్లీ అంతటా పోస్టర్లు అంటించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న సుమారు 850 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గణతంత్ర వేడుకల భద్రత కోసం AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, వెయ్యికి పైగా హై-డెఫినిషన్ (High-Definition) సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. పోలీసులు AI గ్లాసెస్ ధరించి అనుమానితులను గుర్తించనున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఏదైనా గుర్తుతెలియని వస్తువు లేదా అనుమానిత వ్యక్తి కనిపిస్తే వెంటనే 112 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






