ఆయిల్ పామ్ సాగు.. లాభాలు బాగు

by Ratna Kumari |

మండలంలోని సంపత్‌రావుపల్లి గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు శ్రీహరిరావు వ్యవసాయ క్షేత్రంలో 27 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఆయిల్ పామ్ సాగు.. లాభాలు బాగు
X

దిశ, వీపనగండ్ల : మండలంలోని సంపత్‌రావుపల్లి గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు శ్రీహరిరావు వ్యవసాయ క్షేత్రంలో 27 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి విజయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి జిల్లా ఉద్యాన అధికారి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ, సాగునీటి వసతి (బోరు లేదా బావి) ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టడం ద్వారా దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ నాటిన మూడు సంవత్సరాల నుంచి పంట కోత ప్రారంభమవుతుందని, నెలకు రెండు సార్లు గెలల కోత చేపట్టవచ్చని వివరించారు. ఒకసారి నాటిన ఆయిల్ పామ్ తోటలు 25 నుంచి 30 సంవత్సరాల పాటు నిరంతర దిగుబడిని అందించి రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా నిలుస్తాయని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ సాగు ఉత్తమ ప్రత్యామ్నాయమని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, ఉప సర్పంచ్ నాగముని, ఉద్యాన అధికారి కృష్ణయ్య, ప్రీ యూనిక్ ఏరియా మేనేజర్ కెథన్ రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారి శిరీషతో పాటు సంపత్‌రావుపల్లి, తుంకుంట గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Next Story