అర్ధరాత్రి భారీ వర్షం.. మెట్టుగూడలో వరద నీటి తొలగింపుకు అధికారుల ముమ్మర చర్యలు

by Jakkula.Mamatha |

నగరంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో మెట్టుగూడలోని ఆలుగడ్డ బావి పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.

అర్ధరాత్రి భారీ వర్షం.. మెట్టుగూడలో వరద నీటి తొలగింపుకు అధికారుల ముమ్మర చర్యలు
X

దిశ, సికింద్రాబాద్: నగరంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో మెట్టుగూడలోని ఆలుగడ్డ బావి పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తూ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకు రావడానికి కృషి చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు.

Next Story