‘దిశ’ కథనానికి స్పందించిన అధికారులు.. అక్రమ ఫుడ్ స్టాళ్లు కూల్చివేత

by Jakkula.Mamatha |

కేపీహెచ్‌బీ మీ సేవ కేంద్రం ముందు ఫుట్ పాత్ ఆక్రమించి ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లపై ప్రచురితమైన ‘దిశ’ కథనానికి అధికారులు స్పందించారు.

‘దిశ’ కథనానికి స్పందించిన అధికారులు.. అక్రమ ఫుడ్ స్టాళ్లు కూల్చివేత
X

దిశ, బాలనగర్: కేపీహెచ్‌బీ మీ సేవ కేంద్రం ముందు ఫుట్ పాత్ ఆక్రమించి ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లపై ప్రచురితమైన ‘దిశ’ కథనానికి అధికారులు స్పందించారు. రోడ్డు విస్తరణకు, ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారిన అక్రమ నిర్మాణాలను సంబంధిత శాఖల అధికారులు తొలగించారు. కొంతకాలంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లు, షెడ్లు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయగా, ఇటీవల ‘దిశ’లో ప్రచురితమైన కథనం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టి ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణలు తొలగించడంతో రహదారి విశాలంగా మారి వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన ‘దిశ’కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Next Story