మంత్రి తుమ్మలకు నిరసన సెగ

by Ajay Maddhiboyina |

త్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు నిర‌స‌న సెగ తగిలింది. హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి అంటూ పీడీఎస్‌యూ నేతలు ఆందోళనకు దిగారు.

మంత్రి తుమ్మలకు నిరసన సెగ
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు నిర‌స‌న సెగ తగిలింది. హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి అంటూ పీడీఎస్‌యూ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటువైపుగా రావడంతో ఆయన కాన్వాయ్‌ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పెండింగ్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడ నుండి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు భారీగా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో 2021 నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా అప్పటికే 7వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలతో కలిపి మొత్తం 10వేల కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. దీంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. విద్యార్థులతో పాటు ఫీజులు కట్టలేక వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Next Story