జహీరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కొనసాగించాల్సిందే : నెమలికొండ వేణుమాధవ్

by Nallavelli.Anjaneyulu |

ముంబై-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో పాత డీపీఆర్‌లో ప్రతిపాదించిన జహీరాబాద్ స్టేషన్‌ను యథాతథంగా కొనసాగించాలని సామాజిక కార్యకర్త నెమలికొండ వేణుమాధవ్ డిమాండ్ చేశారు.

జహీరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కొనసాగించాల్సిందే  : నెమలికొండ వేణుమాధవ్
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ముంబై-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో పాత డీపీఆర్‌లో ప్రతిపాదించిన జహీరాబాద్ స్టేషన్‌ను యథాతథంగా కొనసాగించాలని సామాజిక కార్యకర్త నెమలికొండ వేణుమాధవ్ డిమాండ్ చేశారు. జహీరాబాద్ స్టేషన్ తొలగిస్తే సంగారెడ్డి జిల్లా అభివృద్ధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీలు సురేష్ షెట్కర్, రఘునందన్ రావు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్‌కు వేణుమాధవ్ బహిరంగ లేఖ రాశారు. జిల్లాకు వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాజెక్టులోజహీరాబాద్‌కు తగిన ప్రాధాన్యం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇప్పటికే జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కోసం రైతులు సుమారు 13 వేల ఎకరాల భూములను కోల్పోయారు.


అదనంగా ఫార్మా సిటీ కోసం మరో 5 వేల ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంతటి త్యాగాలు చేసిన ప్రాంతానికి హైస్పీడ్ రైల్ స్టేషన్ కల్పించడం న్యాయసమ్మతం అని వేణుమాధవ్ అన్నారు. జహీరాబాద్‌లో హైస్పీడ్ రైల్ స్టేషన్ ఏర్పాటు ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులు, విద్యార్థులు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. స్టేషన్ తొలగిస్తే జిల్లా పారిశ్రామిక అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు, రైతులు, యువత, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఒక్కటై జహీరాబాద్ హైస్పీడ్ రైల్ స్టేషన్ సాధన కోసం ఉద్యమించాలని వేణుమాధవ్ పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక స్టేషన్ కోసం పోరాటం కాదు.. సంగారెడ్డి జిల్లా భవిష్యత్తు కోసం చేస్తున్న ఉద్యమం అని ఆయన స్పష్టం చేశారు.

Next Story