- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు కారు పల్టీ.. తప్పిన పెను ప్రమాదం
తల్లాడ మండలంలో నరసరావుపేట గ్రామ సమీపంలో శనివారం ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది.

దిశ,తల్లాడ: తల్లాడ మండలంలో నరసరావుపేట గ్రామ సమీపంలో శనివారం ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండల పరిధిలోని నరసరావుపేట గ్రామం సమీపంలో ఏన్కూర్ నుంచి తల్లాడ వైపు వెళ్తున్న కారు నరసరావుపేట గ్రామానికి చెందిన ఓ బాలుడు సైకిల్ పై రోడ్డు దాటుతుండగా ఆ బాలుడిని తప్పించబోయి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అవడంతో.. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో వారిని వైరాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వైరా పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.






