- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూవివాదంలో ఘోరం.. మహిళపై వేటకొడవళ్లతో దాడి
అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో భూమి తగాదా చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగభూషణ్ రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District) నార్పల మండలం బండ్లపల్లి(Bandlapalli)లో భూమి తగాదా(Land dispute) చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగభూషణ్ రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
మాట మాట పెరిగి..
అయితే మాట మాట పెరగడంతో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబంపై వేటకొడవళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నారాయణరెడ్డి భార్య తిరుపాలమ్మకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆమె తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు.
తిరుపాలమ్మకు చికిత్స
ఈ రక్తపాతాన్ని గమనించిన స్థానికులు గాయపడిన తిరుపాలమ్మను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






