దిశ ఎఫెక్ట్ : ఆస్పత్రి బాత్రూమ్‌లో నీటి కొరత తీర్చిన అధికారులు

by Batti.Sumithra |

‘దిశ’ దినపత్రిక వెబ్ సైట్ లో‘ఆసుపత్రిలో నీటి కొరత- పేషెంట్ల అవస్థలు’ అనే కథనం ప్రచురితం కావడంతో ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించారు.

దిశ ఎఫెక్ట్ : ఆస్పత్రి బాత్రూమ్‌లో నీటి కొరత తీర్చిన అధికారులు
X

దిశ, జడ్చర్ల : ‘దిశ’ దినపత్రిక వెబ్ సైట్ లో‘ఆసుపత్రిలో నీటి కొరత- పేషెంట్ల అవస్థలు’ అనే కథనం ప్రచురితం కావడంతో ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించారు. జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్షదుల్లా వెంటనే పాడైన బోరు మోటార్లకు మరమ్మతులు చేయించి చర్యలు చేపట్టి వార్డుల్లోని బాత్రూమ్‌లకు నీటి సరఫరాను పునరుద్ధరించారు. మూడు రోజులుగా తాళం వేసి ఉన్న బాత్రూమ్‌లను తెరిపించి, పేషెంట్లకు అందుబాటులోకి తెచ్చారు. పాడైన వాష్ బేసిన్ల మరమ్మతులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ‘దిశ’ కథనం ద్వారా సమస్య వెలుగులోకి రావడంతో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం పై పేషెంట్లు, వారి సహాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే ‘దిశ’ దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఆసుపత్రిలో నీటి కొరత రాకుండా, పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

Next Story