- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటార్మూర్‌లో నిజాంసాగర్ కాల్వ స్థలంలో నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కన కోటార్మూర్ రెవెన్యూలో మున్సిపల్ ఆరో వార్డు పరిధిలో గతంలో మున్సిపల్, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసిన నిజాంసాగర్ కాల్వ స్థలాన్ని సుమారు ఒక సంవత్సరం క్రితం గుర్తించారు.

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కన కోటార్మూర్ రెవెన్యూలో మున్సిపల్ ఆరో వార్డు పరిధిలో గతంలో మున్సిపల్, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసిన నిజాంసాగర్ కాల్వ స్థలాన్ని సుమారు ఒక సంవత్సరం క్రితం గుర్తించారు. మూడు ప్రభుత్వ శాఖల అధికారులు గుర్తించిన నిజాంసాగర్ కెనాల్ స్థలంలో చేపడుతున్న నిర్మాణ పనులను గురువారం ఆర్మూర్ తహసీల్దార్ సత్య నారాయణ, నీటిపారుదల శాఖ డీఈ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు లు పరిశీలించారు. కోటార్మూర్‌లో నీటిపారుదల శాఖకు చెందిన నిజాంసాగర్ కాల్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్నారనే విషయం పై మూడు ప్రభుత్వ శాఖల అధికారులు ఆ నిర్మాణ పనులు చేపడుతున్న కాల్వ స్థలం వద్దకు తరలి వెళ్లారు.
గతంలో ఇదే మూడు ప్రభుత్వ శాఖల అధికారులు సర్వే చేసి గుర్తించిన నిజాంసాగర్ కాలువ స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్నారని అధికారులు వెళ్లి పరిశీలించారు. అధికారులకు సమాచారం లేకుండా కాల్వ స్థలంలో నిర్మాణాలు చేసినందున నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశామన్నారు. నిజాంసాగర్ కాల్వ స్థలంలో నిర్మాణ పనులు చేస్తున్న సదరు వ్యక్తులకు నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. మూడు శాఖల అధికారులు నిర్మాణాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు. నిజాంసాగర్ కాల్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ముగ్గురు ప్రభుత్వ శాఖల అధికారుల పరిశీలనలో అధికారులు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు, మున్సిపల్ ఏఈ కిరణ్, నీటిపారుదల శాఖ ఏఈ పవన్, చందు, ఆర్ ఐ ప్రమోద్, మూడు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.






