స్కూల్‌లో ‘కల్మా’ హోంవర్క్.. సీరియస్‌గా స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-17 05:51:25  IST  )

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి ‘కల్మా’ చదవాలని హోంవర్క్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

స్కూల్‌లో ‘కల్మా’ హోంవర్క్.. సీరియస్‌గా స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
X

దిశ,చంపాపేట్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి ‘కల్మా’ చదవాలని హోంవర్క్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. పాఠశాలలో విద్యార్థులకు మతపరమైన అంశాలను హోంవర్క్ రూపంలో ఇవ్వడం పిల్లల హక్కులు, మానవ హక్కుల పరిరక్షణ సూత్రాలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.

ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, వాస్తవ పరిస్థితులు ఏమిటో వివరిస్తూ రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్ (సీపీ), విద్యాశాఖ అధికారులను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించి నివేదిక సమర్పించాల్సి ఉంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Next Story