- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్‌లో మత బోధనలపై NHRC ఆగ్రహం.. కలెక్టర్, ఎస్పీకి కీలక ఆదేశాలు
హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్‌లో మతబోధనలు చేస్టున్నట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థికి డైరీలో ఖురాన్ చదవాలంటూ హోం వర్క్ ఇవ్వడంతో అతడి తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్‌లో మతబోధనలు చేస్టున్నట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థికి డైరీలో ఖురాన్ చదవాలంటూ హోం వర్క్ ఇవ్వడంతో అతడి తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
బీఎస్ఎస్ 299, జువైనల్ సెక్షన్ 75కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్, యాజమాన్యంతో పాటు డైరీలో ఖురాన్ హోం వర్క్ గా పేర్కొన్న టీచర్ పైనా కేసు నమోదైంది. మరోవైపు ఈ ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ సైతం సీరియస్ అయ్యింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. మతబోధనలపై స్కూల్ వివరణ ఇవ్వాలని కోరింది. హైదరాబాద్ సీపీ, కలెక్టర్, డీఈవోకు నోటీసులు ఇచ్చి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.






