- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక ధరలకు యూరియా అమ్మకం.. పట్టించుకోని అధికారులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా పక్కదారి పట్టకుండా రైతుల అవసరాలను తీర్చేందుకు యూరియా యాప్‌ను ఏర్పాటు చేసిన విషయం విధితమే.

దిశ, వలిగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా పక్కదారి పట్టకుండా రైతుల అవసరాలను తీర్చేందుకు యూరియా యాప్‌ను ఏర్పాటు చేసిన విషయం విధితమే. కానీ ఫెర్టిలైజర్ షాప్ యజమానులు మాత్రం రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని బస్తాకు రూ.50 నుంచి రూ.60లు అదనంగా వసూలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.267 అయితే షాపు యజమానులు మాత్రం బస్తాకు రూ.320 నుంచి రూ.330 వసూలు చేస్తున్నారు.
అందుకు నిదర్శనం ఫోన్ పే, గూగుల్ పే పేమెంట్. అధిక ధరల యూరియాల అమ్మకం మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న ఫెర్టిలైజర్ షాపుల్లో ఇదే తతంగం కొనసాగుతుంది. అధికారులు తనిఖీలు నిర్వహించిన పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఫెర్టిలైజర్ షాపు యజమానులు ధనార్జనే దేహంగా భరోసాగా అమ్మకాలు చేపడుతున్నారు. అందుకు నిదర్శనం స్పష్టంగా గూగుల్ పే ఫోన్ పే ఫోన్ పే పేమెంట్లే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు యూరియా అమ్మకుండా నియంత్రించాలని, షాపులపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని, రైతులకు సహకరించాలని రైతులు కోరుచున్నారు.






