రాఘవ లారెన్స్ ‘RL-30’లో నలుగురు క్రేజీ భామలు.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అంచనాలను పెంచేయగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

రాఘవ లారెన్స్ ‘RL-30’లో నలుగురు క్రేజీ భామలు.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: కొరియేగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం కాంచన-4, బెంజ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 30వ చిత్రాన్ని కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. RL 30 వర్కింగ్ టైటిల్‌తో రాబోతోంది. అయితే ఇప్పటికే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్, తన ల్యాండ్‌మార్క్ సినిమా కోసం ఒక కొత్త వ్యక్తికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం విశేషం. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే లారెన్స్, ఈసారి తిరుపుగళ్ అనే కొత్త దర్శకుడికి ఈ సువర్ణావకాశాన్ని ఇచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న సంచలన యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

రాఘవ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లారెన్స్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అంచనాలను పెంచేయగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్లు సాయి పల్లవి, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రేజీ మల్టీస్టారర్ కాస్టింగ్ కనుక నిజమైతే, సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక అతిపెద్ద సెన్సేషన్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. నలుగురు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తుండటంతో, లారెన్స్ ‘RL 30’ సినిమాపై అంచనాలు ఇప్పుడే స్కై హైకి చేరిపోయాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లలో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.

Next Story