- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామమాత్ర ప్రదర్శనగా విత్తన మేళా.. కనిపించని అధికారులు, స్టాల్ నిర్వాహకులు
వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళా నామమాత్ర ప్రదర్శనగా కనిపిస్తుంది.

దిశ,చిన్నచింతకుంట: వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళా నామమాత్ర ప్రదర్శనగా కనిపిస్తుంది. శనివారం ఈ విత్తన మేళాలో వ్యవసాయశాఖ అధికారులు, స్టాల్ నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో విత్తన మేళా వెలవెలబోతుంది.ప్రభుత్వం ఎంపిక చేసిన సన్నరకం వరి విత్తనాలనే సాగు చేయాలని, వాటిని రైతు వేదికలో ఉంచి విత్తన మేళా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు ఆదేశాలను పాటించడం లేదు వరి విత్తనాల మేళా చిన్న చింతకుంట మండలంలో కొనసాగడం లేదు.
ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల వరి విత్తనాలతో సాగు చేస్తేనే క్వింటాల్ కు 500 బోనస్ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికల్లో ఈనెల 30 వరకు ఇతన మేళాలను ఏర్పాటు చేశారు. కానీ మండలంలో ఈనెల 23న ప్రారంభమైన విత్తన మేళ నామమాత్రంగా నిర్వహించి వ్యవసాయ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు సన్నరకం పై అవగాహన కల్పించకపోవడంతో రైతులు ప్రైవేట్ లో ఇతర రకాల వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో బోనస్ అందించే వరి విత్తనాలను సాగు చేసుకునేలా అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. విత్తన మేళా లో రైతులు కాకుండా రాజకీయ నేతల సందడి ఎక్కువగా కనిపించింది. దీనిపై వ్యవసాయ శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






