దేశ రక్షణ దళాల కొత్త అధిపతిగా ఎన్.ఎస్. రాజా సుబ్రమణి!

by Malleboina Mahesh |

భారత ప్రభుత్వం నూతన సీడీఎస్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణిని నియమించింది. ఆయన మిలిటరీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

దేశ రక్షణ దళాల కొత్త అధిపతిగా ఎన్.ఎస్. రాజా సుబ్రమణి!
X

దిశ, వెబ్ డెస్క్: భారత రక్షణ రంగంలో అత్యున్నత స్థాయి నియామకం చేపడుతూ కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి (N.S. Raja Subramani)ని నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీడీఎస్‌గా వ్యవహరిస్తూనే, ఆయన భారత ప్రభుత్వంలోని మిలిటరీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ (DMA) సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, రక్షణ రంగ ఆధునీకరణ, వ్యూహాత్మక నిర్ణయాల్లో సీడీఎస్ పాత్ర అత్యంత కీలకం. గతంలో సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి, అపారమైన అనుభవం ఉన్న రాజా సుబ్రమణి నియామకం దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన రక్షణ దళాల ఉమ్మడి కార్యాచరణ, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోడానికి అవసరమైన వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది.

Next Story