ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తుకు అవకాశం

by Kema Shiva Kumar |

తెలంగాణలోని 23 ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తుకు అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని 23 ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాఠశాలల్లోని మొత్తం 1380 సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె.సీతాలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని, దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 20 చివరి తేదీ అని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులు 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలకు ఎంపికవుతారని ఆమె తెలిపారు. ప్రవేశ పరీక్షను మార్చి 29వ తేదీన నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు http://tsemrs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

Next Story