- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీలక్ష్మీ డెవలపర్స్ కు నోటీసులు
కడ్తాల్ మండలంలోని గోవిందాయపల్లి తండాలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్‌పై పంచాయతీ అధికారులు స్పందించారు.

దిశ, కడ్తాల్ : కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ రెవెన్యూ పరిధిలోని గోవిందాయపల్లి తండాలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్‌పై పంచాయతీ అధికారులు స్పందించారు. సంబంధిత వెంచర్ నిర్వాహకుల పేరిట నోటీసు జారీ చేశారు. సర్వే నెం.41లోని 3.36 ఎకరాల్లో ‘శ్రీలక్ష్మీఫామ్స్’ పేరుతో వెంచర్ ఏర్పాటు చేయగా.. నిబంధనల మేరకు వివిధ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ప్లాటింగ్ చేయడంతో పాటు ఫ్రీకాస్ట్ వాల్, మట్టి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి ప్లాట్ల క్రయ,విక్రయాలకు సిద్దపడ్డారు. రియల్టర్ల అక్రమ దందాపై ‘దిశ’ పత్రిక ‘శ్రీలక్ష్మీ ఫామ్స్’ లీలలు పేరుతో కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి అశ్వాఖ్ శ్రీ లక్ష్మీ డెవలపర్స్ పేరుతో నోటీసులు జారీ చేశారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకా రం అనుమతులు లేకుండా వెంచర్ చేయడం చ ట్టవిరుద్దమని నోటీసులో పేర్కొన్నారు.
గోడకు అంటించిన నోటీసు..
అక్రమ వెంచర్ పై అధికారులు స్పందించిన తీరు బాగానే ఉన్నప్పటికీ.. నోటీసులు జారీ చేసిన తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు నాలుగు ఎకరాల్లో అనధికారికంగా చేపడుతున్న వెంచర్ వల్ల పంచాయతీకి 10 శాతం ల్యాండ్‌తో పాటు, రెవెన్యూకు నాలా కన్వర్షన్ ఫీజు రావాల్సి ఉంది. వీటి రూపేణా రూ.లక్షల్లో ఆదాయాన్ని రెండు శాఖలు కోల్పోతున్నాయి. అ క్రమ వెంచర్‌పై ఆరోపణలు రావడంతో అధికారు లు నోటీసులు జారీ చేశారు. కానీ.. ఆ నోటీసును వెంచర్‌లోని ఫ్రీ కాస్ట్ వాల్‌కు అంటించి వచ్చారని తెలిసింది. నోటీసులో రియల్టర్ పేరును ప్రస్తావించలేదు. అలాగే ఆయా నోటీసును సంబంధిత వ్య క్తులకు కూడా అందజేయలేదని, సీరియస్‌గా తీ సుకోవాల్సిన విషయాన్ని అధికారులు తేలికగా తీసుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేయ డం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంచర్ నిర్వాహకులకు నోటీసు ఇచ్చి.. వారు స్పందించకపోతే ఒకటికి రెండుసార్లు నోటీసులు ఇచ్చి నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టాల్సి ఉం టుంది. అయితే ఇక్కడ రియల్టర్‌కు సంబంధించిన ఎవరి పేరును కూడా ప్రస్తావించకుండా నో టీసులను జారీ చేయడంతో సదరు వెంచర్‌కు సంబంధించిన వ్యక్తులు నోటీసుకు స్పందించే ఆ స్కారం లేకుండా పోయింది. ఇదంతా.. కాలయాపన కోసమా! లేక చేతులు ఎత్తేసే ప్రయత్నమా! అని అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Tags
- Layout






