- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవు.. BRS సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ (SIT) ఇచ్చిన నోటీసులు చెల్లవని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఇచ్చిన నోటీసులు చెల్లవని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు (Mohit Rao) అన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తరఫున అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్‌పీసీ 160 (CRPC-160) ప్రకారం చట్టబద్ధంగా ఆంక్షలు ఉన్నందున కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వలేరని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని, ఏళ్ల తరబడి విచారణ పిలుస్తామంటే కురదని కామెంట్ చేశారు. గతంలో ఇలాంటి కేసులను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) వందల సంఖ్యలో కొట్టేసిందని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు ప్రకటించారు.






