‘హ్యాండ్ మేడ్’ కాదు.. ఇది ‘ఫుట్ మేడ్’ తందూరి రోటి

by Malleboina Mahesh |

హోటళ్లు/డాబాలలో తందూరి రొట్టెల కోసం పిండిని చేతులతో కాకుండా కాళ్లతో తొక్కుతున్న వికృత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

‘హ్యాండ్ మేడ్’ కాదు.. ఇది ‘ఫుట్ మేడ్’ తందూరి రోటి
X

దిశ, వెబ్ డెస్క్: హోటళ్లు, రోడ్‌సైడ్ డాబాల్లో వేడివేడిగా లభించే తందూరి రోటీలు, నాన్‌లు అంటే ఇష్టపడని ఆహార ప్రియులు ఉండరు. అయితే, బయట దొరికే ఆహారం ఎంతవరకు పరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతుందనే దానికి సాక్ష్యంగా నిలిచే జుగుప్సాకరమైన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక హోటల్ వంటగదిలో తందూరి రొట్టెల కోసం పిండిని చేతులతో కాకుండా.. ఏకంగా తన కాళ్లతో తొక్కుతూ వికృత చేష్టలకు పాల్పడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ‘హ్యాండ్ మేడ్’ (చేతితో చేసినవి) అని నమ్మి మనం తినే ఈ ఆహార పదార్థాలు నిజానికి ‘ఫుట్ మేడ్’ (కాళ్లతో తొక్కినవి) అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆమె పెద్ద మొత్తంలో ఉన్న మైదా/గోధుమ పిండి ముద్దపై చెప్పుతో ఉన్న కాలిని పెట్టి తొక్కుతూ కనిపించింది. ఈ దృశ్యాలు చూసిన ఆహార ప్రియులు తీవ్ర అసహ్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో, ముఖ్యంగా హోటళ్లకు వచ్చే వినియోగదారుల ప్రాణాలతో ఇలాంటి సిబ్బంది యథేచ్ఛగా చెలగాటమాడుతున్నారని వాపోతున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు దేశంలోని పలు నగరాల్లో వెలుగు చూసినప్పుడు ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత) అధికారులు దాడులు నిర్వహించి సదరు హోటళ్లను సీజ్ చేశారు. తాజా వీడియోపై కూడా ఉన్నతాధికారులు స్పందించి, ఈ అపరిశుభ్ర కట్టడాల తయారీదారులను గుర్తించి కఠినమైన శిక్షలు వేయాలని, గట్టి నిఘా ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story