ఏడాది కూడా గడవలేదు.. అప్పుడే కుంగిపోయిన అన్నారుగూడెం ప్రధాన రహదారి!

by Jakkula.Mamatha |

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పాత సినిమా హాల్ నుంచి అన్నారుగూడెం వరకు సుమారు రూ.6 కోట్ల వ్యయంతో 5 కిలోమీటర్ల వరకు వేసిన బీటీ రోడ్డు కేవలం సంవత్సరం తిరగక ముందే తీవ్రంగా దెబ్బ తినడం జరిగింది.

ఏడాది కూడా గడవలేదు.. అప్పుడే కుంగిపోయిన అన్నారుగూడెం ప్రధాన రహదారి!
X

దిశ,తల్లాడ: పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పాత సినిమా హాల్ నుంచి అన్నారుగూడెం వరకు సుమారు రూ.6 కోట్ల వ్యయంతో 5 కిలోమీటర్ల వరకు వేసిన బీటీ రోడ్డు కేవలం సంవత్సరం తిరగక ముందే తీవ్రంగా దెబ్బ తినడం జరిగింది. తల్లాడ నుంచి అన్నారుగూడెంకి వెళ్లే ప్రధాన రహదారి పక్కన భాగం భారీగా కుంగిపోయి, మట్టి కొట్టుకుపోయింది.

దీనివల్ల రోడ్డు చాలా ఇరుకుగా మారింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ఇది తీవ్ర ప్రాణసంకటంగా మారింది. వాహనాలు ఏ మాత్రం పక్కకు జరిగిన పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, తక్షణమే ఇక్కడ రక్షణ గోడ(Retaining wall) నిర్మించి, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాల్సిందిగా గ్రామ ప్రజలు కోరారు.

Next Story