- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడినప్పటికీ డబ్బులు ఇవ్వడం లేదు.. దుమారం రేపుతున్న చాందిని చౌదరి పోస్ట్
పరిశ్రమలో మోడల్స్, ఆర్టిస్టులు తాము కష్టపడి చేసిన పనికి రావాల్సిన సొంత డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడం నిజంగా చాలా దారుణం.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి మొదట షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ రాబట్టుకున్నారు. ఇక నటనపై ఆసక్తితో ‘కేటుగాడు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘కలర్ ఫొటో’ తో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. గత ఏడాది విడుదలైన ‘సంతాన ప్రాప్తి రస్తు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టి పెడుతూనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చాందిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘పరిశ్రమలో మోడల్స్, ఆర్టిస్టులు తాము కష్టపడి చేసిన పనికి రావాల్సిన సొంత డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడం నిజంగా చాలా దారుణం. ఈ బాధ ఎలా ఉంటుందో నాకూ తెలుసు, ఎందుకంటే ప్రస్తుతం నేను కూడా సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. నేను నటించిన ఒక సినిమాకు సంబంధించి నాకు రావాల్సిన రెమ్యునరేషన్ డబ్బులను ఇంతవరకు ఇవ్వలేదు.
గత రెండేళ్లుగా నా సొంత డబ్బుల కోసం నేను వాళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, ఎదురుచూస్తూనే ఉన్నాను. ఆ ఒక్క సినిమా కోసం దాదాపు నేను ఐదేళ్ల పాటు కష్టపడ్డాను. కానీ చివరికి మూవీ అయిపోయాక వాళ్లు నన్ను కనీసం పట్టించుకోవడం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వకుండా వదిలేశారు’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. ప్రస్తుతం చాందిని చేసిన ఈ వ్యాఖ్యలతో నెట్టింట ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చాందిని చౌదరి తన కెరీర్‌లో ఐదేళ్ల పాటు వర్క్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే.. అది మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘గామి’ అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చాలా ఏళ్ల పాటు సాగిందని.. పైగా ఈ చిత్రం విడుదలై కూడా దాదాపు రెండేళ్లు అవుతుండటంతో.. చాందిని చౌదరి ఆరోపిస్తున్నది ‘గామి’ చిత్ర నిర్మాతలపైనే అయ్యుంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.






