రూ.200 కోట్ల అవినీతి తిమింగలం.. సంచుల్లో భారీగా నోట్ల కట్టలు

by Naga Rani Yarlagadda |

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

రూ.200 కోట్ల అవినీతి తిమింగలం.. సంచుల్లో భారీగా నోట్ల కట్టలు
X

దిశ, వెబ్‌డెస్క్: ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో నారాయణగూడలోని సర్వే భవన్లో, సర్వే సెటిల్ మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచీ సోదాలు చేస్తోన్న అధికారులు.. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన సోదాల్లో రూ.200 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించినట్లు సమాచారం. కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెడ్రూమ్ లో ఉన్న బెడ్ కింద రూ.1.10 కోట్ల విలువైన నోట్ల కట్టలు, బీరువాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. సంచుల్లో నోట్ల కట్టలు నింపి సజ్జపై దాచి ఉంచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఛత్రినాక నివాసంలో ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులను సీజ్ చేశారు.

Next Story