- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల చేతిలో బీటీ -3 విత్తనాలు.. ఆంధ్రభాయ్ దందాపై ముందే తెలిపిన "దిశ"!
తెల్ల బంగారంగా పిలిచే పత్తి రైతులకు వి‘‘పత్తిని” కలిగిస్తోంది.

దిశ, కాటారం: తెల్ల బంగారంగా పిలిచే పత్తి రైతులకు వి‘‘పత్తిని” కలిగిస్తోంది. ఆంధ్ర బాయ్ ముఠా ఆడే ఆటలో చేను చెలకను పీల్చి పిప్పి చేస్తుంది. నిషేదిత బీటీ3 పత్తి విత్తనాల వాడకం ఏటా పెరుగుతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కాటారం మండలంలో నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాల అమ్మకం జోరుగా సాగుతోందని, దీనిపై వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. కాటారం మండలంలో ఆంధ్ర భాయ్ పక్క రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా నకిలీ పత్తి విత్తనాలు దిగుమతి చేశారు. వాటిని ఎవరికి అనుమానం రాకుండా ఇండ్లలో, రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసినట్టు "దిశ" దినపత్రిక ముందుగానే తెలిపిన విషయం తెలిసిందే. కానీ అధికారులు మాత్రం ఆంధ్ర బాయ్ విత్తన దందాలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అధికారులు ఏం కసరత్తు చేశారు..?
వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు పెంచాలని రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిషేదిత బీటీ 3 విత్తనాలు, నకిలీ విత్తనాలను నియంత్రించే వ్యవస్థలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. హెచ్టీబీటీ, నకిలీ విత్తనాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీమ్‌లు నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో రైతులకు హెచ్‌టీబీటీ విత్తనాలను అంటగడుతున్నాయి. రైతులు కూడా కలుపు తీసే బాధ తప్పుతుందని బీటీ 3 విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రెండు, మూడేండ్ల కింది వరకు పత్తి సాగులో 30 శాతంగా ఉన్న హెచ్‌టీ పత్తి విత్తనాల వాటా ప్రస్తుతం 50 నుంచి 70 శాతానికి చేరిందని అంచనా.
ఆంధ్ర భాయ్ ముఠా పక్క ప్లాన్..
పత్తి సీజన్లో లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల నిఘా ఉంటుందని ఆంధ్ర భాయ్ ముఠా ముందుగానే గ్రహించి నకిలీ విత్తనాలను రైతులకు విశ్రయించినట్టు సమాచారం..! యేటా నకిలీ పత్తి విత్తనాలు అమ్మే విత్తన మాఫియా పై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నా నకిలీ పత్తి విక్రయాల దందా ఆగడం లేదు. గుంటూరు ప్రాంతానికి చెందిన ఆంధ్ర భాయ్ వ్యవసాయం నిమిత్తం కాటారం ప్రాంతంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లోని, గుంటూరు, కర్నూలు,తో పాటు గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తూ, కాటారం మండల కేంద్రానికి చెందిన పలుకుబడిన వ్యక్తుల ద్వారా ఇక్కడి రైతులకు విక్రయిస్తున్నారు.
సీజన్ ముందే జోరుగా దందా..!
కాటారం మండలంలో పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత ఏడాది సీజన్లో 17 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. వర్షాకాలం (జూన్, జులై నెలల్లో)లో పత్తి పంట వేయడానికి రైతులు సిద్ధమవుతారు. సాగు చేసే సమయంలో వ్యవసాయ, పోలీసు, టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు వాహనాలను, ఎరువులు, విత్తనాలు విక్రయించే షాపులను తనిఖీ చేస్తుంటారు. ఆ సమయంలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మాలంటే అక్రమార్కులకు కష్టంగా ఉంటుంది. దీంతో నాలుగు నెలల ముందే నకిలీ విత్తనాల దందాకు అక్రమార్కులు తెర లేపారు.
ఇతర రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి..
కాటారం మండలంలో నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించే వారు వివిధ రాష్ట్రాల నుంచి భూపాలపల్లి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు తరలించారు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వాహనాల్లో జిల్లాకు తీసుకువచ్చారు, ఈ విత్తనాలను ఆయా గ్రామాల్లోని స్థానిక పలుకు బడిన రైతుల ద్వారా రైతులకే అంటగడుతున్నారు. కిలో విత్తనాలను రూ.2 వేల నుంచి 2600ల వరకు విక్రయిస్తున్నారు. రైతులు సైతం బీటీ 3 విత్తనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండడంతో ఆంధ్ర బాయి కి చీకటి వ్యాపారం వరంగా మారుతుంది.
ఈ ప్రాంతాల్లోనే అధిక విక్రయాలు..
కాటారం మహా ముత్తారం మహాదేవపూర్ మండలాల్లో ఎక్కువ శాతం నకిలీ పత్తి విత్తనాలను ఆంధ్ర బాయ్ విక్రయిస్తున్నారు. యేటా ఈ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు విక్రయించే ఆంధ్ర భాయ్ ముఠాపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నా మార్పు రావడం లేదు. ఈ ప్రాంతాల్లో సీజన్ కు ముందే ఇప్పటికే బీటీ 3 విత్తనాలను దిగుమతి చేసుకుని కోట్ల రూపాయల విలువ చేసే విత్తనాలను నిల్వ ఉంచినట్లు, రైతులకు విశ్రయించినట్టు సమాచారం.
ఆంధ్ర భాయ్ ముఠాకు సహకరిస్తున్న అధికారి ఎవరు..?
ప్రభుత్వ ఆమోదం పొందిన ఫెర్టిలైజర్స్ లైసెన్స్ కలిగిన షాపుల్లో ఆకస్మిక తనిఖీలు పేరుతో హడావుడి చేస్తూ ఆంధ్ర బాయ్ విత్తన దందాకు ఓ అధికారి సహకరిస్తున్నట్లు సమాచారం..! బీటీ-3 విత్తనాల ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
సహకరిస్తున్న అధికారులు.. మద్దతుగా పెద్దలు!
నిషేధిత బీటీ-3 విత్తనాల దందా వెనుక అధికారులు, మరియు అధికారంలో ఉన్న కొందరు పెద్దల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో స్థానిక రైతులే ఏజెంట్లుగా మార్చుకుని కోట్లు దండుకునేందుకు ఆంధ్ర భాయ్ ముఠా సిద్ధమయ్యారు. వ్యవసాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు నిద్రమత్తులో ఉన్నాయి. బీటీ-3 విత్తన అక్రమ రవాణాను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆంధ్ర బాయ్ విత్తన మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






