- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల్లోకి రాబోతున్న మరో హీరో.. నా దృష్టంతా ప్రజాసేవపైనే పెడతానంటూ కామెంట్స్
తన సినీ ప్రయాణం ఇంకొక పదిహేను, పదహారేళ్లు కొనసాగుతుందో లేదో తాను ఖచ్చితంగా చెప్పలేనని జీవీ ప్రకాష్ అన్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత తమిళ ఇండస్ట్రీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. స్టార్ హీరోలు ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. విజయ్ సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో కోలీవుడ్ హీరోలు ఒక్కొరొక్కరిగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పటికే రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ ప్రకటన చేయగా.. ఎప్పుడనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు. ఇక ఇప్పుడు మరో హీరో రాజకీయాల్లో రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న జీవీ ప్రకాష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి.
తన సినీ ప్రయాణం ఇంకొక పదిహేను, పదహారేళ్లు కొనసాగుతుందో లేదో తాను ఖచ్చితంగా చెప్పలేనని జీవీ ప్రకాష్ అన్నారు. కానీ, ఆ తర్వాత మాత్రం తన దృష్టిని పూర్తిగా ప్రజాసేవపైనే పెడతానని స్పష్టం చేశారు. సమాజంలో మార్పు కోసం, ప్రజలకు సేవ చేయడానికి భవిష్యత్తులో ఏదైనా చేస్తానని చెప్పారు. తన ఆలోచనలకు, ఆశయాలకు సరిపోయే ఒక మంచి వేదిక దొరికితే.. వారితో కలిసి పనిచేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విజయ్ పార్టీలో చేరతారని అంతా చర్చించుకుంటున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలంతా సినిమాకంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






