- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవసరమైన ఎరువుకు అదనపు కొనుగోలు షరతు.. రైతు ఫిర్యాదుతో వెలుగులోకి!
మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రంలో డి.ఏ.పీ ఎరువుల విక్రయానికి అదనపు ఎరువుల కొనుగోలు చేస్తేనే డి.ఏ.పీ ఇస్తామని షరతుగా పెడుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

దిశ, ధర్మసాగర్: మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రంలో డి.ఏ.పీ ఎరువుల విక్రయానికి అదనపు ఎరువుల కొనుగోలు చేస్తేనే డి.ఏ.పీ ఇస్తామని షరతుగా పెడుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దేవునూరు గ్రామానికి చెందిన రైతు కొంగంటి సందీప్ అనే రైతు పత్తి పంట సాగు కోసం అవసరమైన డి.ఏ.పీ ఎరువులు కొనుగోలు చేసేందుకు ఈ నెల 8వ తేదీన ధర్మసాగర్ మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌కు వెళ్లాడు. మూడు బస్తాల డి.ఏ.పీ ఎరువులు ఇవ్వాలని కోరగా, వాటితో పాటు ఎఫ్-20 ఎరువుల బస్తాలు కూడా కొనుగోలు చేస్తేనే డి.ఏ.పీ ఇస్తామని సిబ్బంది చెప్పినట్లు ఆయన ఆరోపించారు.
తనకు అవసరం లేని ఎరువులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడంతో అదనపు ఆర్థిక భారం పడుతుందని భావించి, డి.ఏ.పీ ఎరువులు తీసుకోకుండానే తిరిగి వచ్చినట్లు రైతు వెల్లడించారు. ఈ విధంగా అవసరం లేని ఎరువులను బలవంతంగా కొనుగోలు చేయించాలని షరతులు విధించడం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేవునూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు చేసిందేం లేక డి.ఏ.పీతో పాటు ఎఫ్-20 ఎరువుల బస్తాలు కూడా కొనుగోలు చేశారు. వాటి రశీదులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా రశీదులు వైరల్ కావడంతో గ్రోమోర్ సిబ్బంది ఒకరు ఆ గ్రామ సర్పంచ్ మధ్యవర్తిత్వంతో రైతులను కాంప్రమైజ్ చేపించాలని వారికి ఏమి కావాలన్న ఇస్తామని అన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం గూర్చి ఏవోను వివరణ కోరగా నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు అని తెలిపారు.






