- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీలో టీచర్, నర్సింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!
by Jakkula.Mamatha |
మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధించుటకు టీచర్స్ కావాలని స్పెషల్ ఆఫీసర్ సుమలత తెలిపారు.

X
దిశ, చిట్యాల: మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధించుటకు టీచర్స్ కావాలని స్పెషల్ ఆఫీసర్ సుమలత తెలిపారు. కేజీబీవీలో తెలుగు పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. ఎంపీహెచ్‌డబ్ల్యు విద్యార్థులకు బోధించుటకు, నర్సింగ్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నవి. ఇవి తాత్కాలిక పద్ధతిలో నియామకం జరుగుతుందని, అర్హత గల మహిళ అభ్యర్థులు సంబంధిత పత్రాలతో చిట్యాలలోని కేజీబీవీలో ఈ నెల 17, 18 తేదీల్లో సా.4.00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఫోన్ నెంబర్ 9398415063 ను సంప్రదించగలరు.
Next Story






