- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట ఏబీవీపీ భారీ ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్‌లో విద్యాశాఖ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ (ABVP) యత్నం.. ప్రైవేట్ ఫీజుల దోపిడీపై నిరసన! విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట ఏబీవీపీ (ABVP) భారీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో ఉద్రిక్త వాతావరణం (Tense atmosphere) నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంతో విద్యాశాఖ కార్యాలయం (Office of Education) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఏబీవీపీ నేతలో కార్యాలయంలోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి చేదాటకుండా చూసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ సభ్యులను బలవంతంగా ఈడ్చుకెళ్లి, పోలీసు వాహనాల్లోకి ఎక్కించి అదుపులోకి (Detain) తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యావ్యవస్థల్లో సంస్కరణలు తెచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు స్పష్టం చేశారు.






