- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. కొత్త అక్రిడిటేషన్ కార్డులు రాని వారికి కూడా బస్‌పాస్‌లు
రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు రవాణా సదుపాయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు రవాణా సదుపాయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్టీసీ యాజమాన్యానికి స్పష్టమైన సూచనలు చేస్తూ సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ లేఖ రాశారు. కొత్తగా అక్రిడిటేషన్ పొందిన పాత్రికేయులందరికీ రాయితీ బస్ పాసులు మంజూరు చేసేందుకు వీలుగా తక్షణమే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించాలని, వీరికి ఈ నెల 17 నుంచి 2028 ఏప్రిల్ 30 వరకు పాసులు మంజూరు చేయాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. అలాగే, ఇంకా కొత్త కార్డులు చేతికి అందని వారికి సైతం ఊరటనిస్తూ, వారు ప్రస్తుతం వాడుతున్న పాత బస్ పాస్‌ల గడువును ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు పద్నాలుగు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల మొత్తం, అంటే మిగిలిన 14 రోజుల పాటు పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగిసినా సరే, ఎలాంటి నిబంధనలు అడ్డుపెట్టకుండా పాత పాస్ తోనే ప్రయాణించేందుకు అనుమతించాలని రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు.






