- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిడ్డా జాగ్రత్త.. మావోయిస్టులందరూ మా పార్టీలోనే ఉన్నారు.. కవిత సెన్సేషనల్ కామెంట్స్
మావోయిస్టులు మా పార్టీలోనే ఉన్నారంటూ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మికులను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అడవిలో అన్నలు ఉంటే సింగరేణి అధికారులు పద్ధతిగా పని చేసేవారు. కానీ ఇప్పుడు అడవిలో అన్నలు లేరు కాబట్టి అడిగే దిక్కులేదని సింగరేణి (singareni) యాజమాన్యం అనుకుంటోంది. కానీ అన్నలందరూ ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారని కవిత వ్యాఖ్యానించారు. బిడ్డా.. గుర్తుపెట్టుకోండి. కార్మికులకు ఇబ్బంది పెడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ కవిత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్‍కే7 భూగర్భ గనివద్దకు వెళ్లిన కవిత అక్కడ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కవితను సింగరేణి సిబ్బంది అడ్డుకోగా కవిత తన అనుచరులతో కలిసి గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా సింగరేణి సిబ్బందికి, హెచ్ఎంఎస్ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
వేధింపులు ఆపాలి:
అనంతరం మాట్లాడిన కవిత మావోయిస్టులు మాతోనే ఉన్నారని కార్మికులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. కార్మికులను వేదించడం ఆపాలన్నారు. లాభాల వాటాల్లోనూ ప్రతియేడాది కార్మికులకు సింగరేణి యాజమాన్యం నష్టం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలోని మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవని ఇకనైనా ఈ సమస్యపై దృష్టి సారించాలన్నారు. సింగరేణిలో ఇప్పటికీ పాత టెక్నాలజీ వాడుతుండటం ఏంటని నిలదీశారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ విస్తరించాలని డిమాండ్ చేశారు.
ఇటీవలే దేవ్ జీని కలిసి కవిత:
మావోయిస్టులు మా పార్టీలోనే ఉన్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. అయితే రెండు వారాల క్రితం మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని కవిత పరామర్శించారు. దేవ్ జీ అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న కవిత.. ఆసుపత్రికి వెళ్లి ఆయనను స్వయంగా కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న దేవ్ జీ సుమారు 40 ఏళ్ల అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికి కొన్ని నెలల క్రితమే పోలీసుల ఎదుట లొంగిపోవడం ద్వారా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సైతం అజ్ఞాతం వీడారు. వీరంతా త్వరలోనే యాక్టివ్ పాలిటిక్స్ రాబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత చేసిన మావోయిస్టు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‍గా మారాయి.






