- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం నామినేషన్ ప్రక్రియ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎంపిక (Election of National President) కోసం నామినేషన్ ప్రక్రియ (Nomination Process) ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ (Nitin Nabin) ఈ పదవికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఇతర అగ్రనేతల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది. నితిన్ నబిన్ అభ్యర్థిత్వానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ నేతలు, అలాగే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఆ రాష్ట్ర నేతలు తమ మద్దతు లేఖలను పార్టీ కార్యాలయంలో సమర్పించారు.
అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మద్దతు తెలుపుతూ నామినేషన్లు వేశారు. జాతీయ అధ్యక్షుడి ఎంపిక దాదాపు ఖరారు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, సీనియర్ నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుండగా, 4 నుంచి 6 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై అధిష్టానం ప్రకటన విడుదల చేయనుంది. ఈ మేరకు బీజేపీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.






