- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోబెల్ శాంతి గ్రహీతకు ఏడున్నరేళ్లు జైలు శిక్ష
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదికు ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది.

దిశ, వెబ్ డెస్క్ : నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదికు ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. తాజాగా తీర్పు ప్రకారం ఆమెకు మొత్తం ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం జైలులోనే ఉన్న నర్గెస్ ఓవైప ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే ఈ తీర్పు రావడం గమనార్హం. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఆమె న్యాయవాది మోస్తఫా నీలీ తెలిపిన వివరాల ప్రకారం.. నర్గెస్ మొహమ్మదిపై ప్రభుత్వం రెండు ప్రధాన ఆరోపణలు మోపింది. మొదటిది.. "దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం, సమావేశాలు నిర్వహించడం" అనే ఆరోపణపై ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. రెండోది.. "ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం" అనే ఆరోపణపై మరో ఏడాదిన్నర జైలు శిక్ష విధించారు. అంతా కలిపి ఆమెకు మొత్తం 7.5 సంవత్సరాల జైలు శిక్ష పడింది.
జైలు శిక్షతో పాటు ఆమెపై మరికొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఆమెకు రెండు సంవత్సరాల పాటు దేశం విడిచి వెళ్లే హక్కు ఉండదు. అంతేకాదు, రెండు సంవత్సరాల పాటు అంతర్గత బహిష్కరణ కూడా విధించారు. అంటే ఆమెను టెహ్రాన్ నుంచి దాదాపు 740 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ఖొరాసాన్ ప్రావిన్స్‌లోని ఖోస్‌ఫ్ అనే పట్టణానికి తరలించాలని ఆదేశించారు. మష్హద్‌లోని రెవల్యూషనరీ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా, ఆమె న్యాయవాది, ఆమె విడుదల నొస్సం పనిచేస్తున్న హక్కుల సంస్థలు, అంతర్జాతీయ మీడియా ఈ సమాచారాన్ని ధృవీకరించాయి.
నర్గెస్ మొహమ్మది ఇరాన్‌లో మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం గత 20 సంవత్సరాలకుపైగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి గుర్తింపుగా ఆమెకు 2023లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. అయితే నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఆమె జైలులోనే ఉండటం విశేషం. గతంలో ఆమెపై ఎన్నో కేసులు పెట్టి, పలుమార్లు అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఆమెకు విధించిన జైలు శిక్షలు 44 సంవత్సరాలకు పైగా ఉంటాయని నర్గెస్ ఫౌండేషన్ చెబుతోంది. ప్రస్తుతం ఆమె ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
కాగా ఇటీవల నర్గెస్ ఆరోగ్యం బాగా క్షీణించినట్టు సమాచారం. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉండటంతో పాటు, క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యలకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. అయినా సరే.. తనకు విధించిన అన్యాయమైన జైలు శిక్ష, మానవ హక్కుల ఉల్లంఘనలకు నిరసనగా ఆమె ఈ ఫిబ్రవరి ప్రారంభంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ దీక్ష కొనసాగుతున్న సమయంలోనే ఈ కొత్త శిక్ష విధించడం ప్రభుత్వ విమర్శకులపై ఇరాన్ మరింత కఠినంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారు. ఈ తీర్పును మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు నర్గెస్ మొహమ్మదిని వెంటనే విడుదల చేయాలని, ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ప్రమాదంలో హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఇరాన్ ప్రభుత్వం మానవ హక్కులను గౌరవించాలని కోరుతోంది.






