- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా మారు మోగుతున్న ఫోన్లు
దేశవ్యాప్తంగా NMDA అలర్ట్ సందేశాలు మొదలయ్యాయి. ప్రజల ఫోన్లు సడన్ గా మారు మోగి పోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా అలర్ట్ సందేశాలు మొదలయ్యాయి. ప్రజల ఫోన్లు సడన్ గా మారు మోగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టే దేశ ప్రజల మోల్ ఫోన్లకు విపత్తుల నిర్వహణ సంస్థ బీప్ అలర్ట్స్ మెసేజెస్ సెండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్' (Cell Broadcast Alert) వ్యవస్థను పరీక్షిస్తోంది. సునామీలు, భూకంపాలు, పిడుగుపాట్లు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా విపత్తు సంభవించే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ 'సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్' పనితీరును నిర్ధారించుకోవడానికి ఈ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) దేశ ప్రజల ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజెస్ పంపించింది.






