NMC కీలక నిర్ణయం.. MBBS విద్యకు పదేళ్ల గడువు

by Muthe.Rajitha |   (  Updated:2026-05-28 04:04:54  IST  )

దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

NMC కీలక నిర్ణయం.. MBBS విద్యకు పదేళ్ల గడువు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఎంబీబీఎస్ (MBBS) కోర్సును పూర్తి చేయడానికి నిర్దేశించిన కాలపరిమితిని సవరిస్తూ ఎన్‌ఎమ్‌సీ ఒక సరికొత్త డ్రాఫ్ట్ అమెండ్‌మెంట్‌ను జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. వైద్య విద్యార్థులు తమ ఎంబీబీఎస్ కోర్సుతో పాటు ఇంటర్న్‌షిప్‌ను కూడా కలిపి గరిష్టంగా 9 ఏళ్లలోపు పూర్తి చేయాల్సి ఉండేది. అయితే, ఈ నిబంధన వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు, మెడికల్ కాలేజీల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ఎన్‌ఎమ్‌సీ.. ఈ గడువును మరో ఏడాది పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై విద్యార్థులు తమ MBBS మరియు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయడానికి మొత్తం 10 ఏళ్ల సుదీర్ఘ గడువు లభిస్తుంది.

అయితే, కోర్సు పూర్తి చేసే కాలపరిమితిని పెంచినప్పటికీ, మెడికల్ విద్యలో నాణ్యతను కాపాడేందుకు ఎన్‌ఎమ్‌సీ ఒక కీలక నిబంధనను మాత్రం యథాతథంగా కొనసాగించింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలను పాస్ అవ్వడానికి ఇచ్చే 4 అటెంప్టుల పరిమితి మునుపటిలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. వైద్య విద్యార్థులు మధ్యలో అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఇబ్బంది పడితే, వారి కెరీర్ పూర్తిగా నష్టపోకుండా ఉండేందుకు ఎన్‌ఎమ్‌సీ తెచ్చిన ఈ 10 ఏళ్ల సవరణ దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ విద్యార్థులకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పవచ్చు.

రోగితో ఎఫైర్.. డాక్టర్ సస్పెండ్

Next Story