- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
నితీష్ కుమార్‌ను రాజ్యసభలోకి ఆహ్వానిస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు. బీహార్‌లో జంగిల్ రాజ్‌ను ఆయన అంతం చేశారని ప్రశంసించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నప్పటికీ.. అందరి దృష్టి ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) పైనే ఉంది. ఆయన రాజ్యసభకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) నేరుగా వెళ్లి ఆయనను కలిశారు. అనంతరం ఇరువురు నేతలు సీఎం నివాసంలో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం అమిత్ షా..నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి రావాడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నితీష్ కుమార్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆయనకు రాజ్యసభలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు. అలాగే రెండు దశాబ్దాలుగా సీఎంగా బీహార్ అభివృద్ధికి నితీష్ చేసిన కృషిని అమిత్ షా కొనియాడారు.
ముఖ్యంగా బీహార్‌లో ఒకప్పుడు నెలకొన్న 'జంగిల్ రాజ్' (అరాచక పాలన)ను అంతం చేయడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారని అమిత్ షా ప్రశంసించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పి, అభివృద్ధిని పరుగులు తీయించిన అనుభవం ఇప్పుడు దేశ రాజకీయాలకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ రాకతో జాతీయ స్థాయిలో ఎన్డీయే (NDA) మరింత బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.






