- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1952లో అంబేద్కర్ ఓటమి: నెహ్రూ సర్కార్‌పై నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు!
1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కాంగ్రెస్ కుట్రే కారణమని, 74 వేల ఓట్ల రద్దు ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: 1952లో అంబేద్కర్ ఓటమిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (BJP MP Nishikant Dubey) కాంగ్రెస్ పార్టీపై, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శనాస్త్రాలు సంధించారు. 1952 ఏప్రిల్ 21న నెహ్రూ గారి నాయకత్వంలో ఓట్ల దొంగతనం, అవకతవకల ద్వారా ప్రజాస్వామ్య హత్యకు పునాది పడిందని ఆయన పేర్కొన్నారు. తొలి లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్‌ని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, అంబేద్కర్‌కి వ్యతిరేకంగా నెహ్రూ స్వయంగా ప్రచారం నిర్వహించారని ఆయన ఆరోపించారు. ముంబై నియోజకవర్గంలో అంబేద్కర్ 14,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం వెనుక వ్యవస్థీకృతమైన అవకతవకలు ఉన్నాయని దూబే తన ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల ఫలితాలపై అంబేద్కర్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పుడు, ఆ నియోజకవర్గంలో సుమారు 74,000 ఓట్లు రద్దు కావడం విస్మయానికి గురిచేసిందని దూబే తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంబేద్కర్ ఓటమికి కారణమైన ఆనాటి కాంగ్రెస్ చరిత్రను కప్పిపుచ్చేందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ విదేశీ శక్తులతో కలిసి ఈసీ, ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ద్విసభ్య నియోజకవర్గం గా ఉన్న ఆనాటి ఎన్నికల్లో అంబేద్కర్, సోషలిస్టు అభ్యర్థి అశోక్ మెహతా కలిసి ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ చారిత్రక వాస్తవమని ఆయన గుర్తుచేశారు.






